TG: తనపై కేసు పెడితే ఊరుకుంటానని CM రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని, పోరాటం చేస్తానని మాజీ మంత్రి KTR హెచ్చరించారు. లగచర్ల ఘటనను SC, ST, మానవ హక్కులు, మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తానన్నారు. ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అని రేవంత్ మభ్యపెడుతున్నారని, ఇది అసాధ్యమన్నారు. CMకు సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదని ఆరోపించారు. ప్రాజెక్టుల పూర్తికి హరీశ్ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా అని ప్రశ్నించారు.