రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం జరుగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తేలిగ్గా ఆపేది లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ఆ దేశంతో కాల్పుల విరమణ చేసుకుని శాంతి నెలకొల్పడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. బలహీనమైన ఒప్పందం చేసుకుంటే.. పశ్చిమ దేశాలు మళ్లీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.