AP: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి.. తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. దీంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.