ఢిల్లీ: మాజీ CM అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో పలువురు రెజ్లర్లు, బాడీ బిల్డర్లు ఆప్‌లో చేరారు. తిలక్ రాజ్, రోహిత్ దలాల్, అక్షయ్ దిలవారీకి కేజ్రీవాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 70-80 మంది బాడీ బిల్డర్లు, రెజ్లర్లు తమ పార్టీలో చేరారని వెల్లడించారు. తిరిగి అధికారంలోకి రాగానే క్రీడాకారుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.