ASR: గూడెం కొత్తవీధి మండలంలోని పెద జడుమూరు గ్రామ శివారులలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న కాఫీ తోటల్లో గురువారం ఎలుగుబంటి దర్శనం ఇచ్చింది. కాఫీ తోటల్లో కాఫీ పండ్లను తింటున్న ఎలుగుబంటిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలుగుబంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాఫీ తోటలకు వెళ్లే గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.