KRNL: నందికొట్కూరు మండలంలోని కోనేటమ్మ పల్లె గ్రామంలో గురువారం తాహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ పొలాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలను అధికారులు స్వీకరించారు. రైతుల ఇచ్చిన అర్జీలను పరిశీలించిన త్వరలో పరిష్కరిస్తామని డిప్యూటీ తాహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామోదర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.