AP: రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో ‘ప్రత్యేక టాస్క్ఫోర్స్’ ఏర్పాటైంది. కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జగన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జిల్లాల వారీగా ఇద్దరిని నియమించారు.