TG: అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు సైకోల్లా మారారని కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమకు దక్కనిది ఎవరికీ దక్కొద్దన్నచందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కట్టు బానిసలుగా చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలని చూస్తుందన్నారు. అందులో భాగంగానే వికారాబాద్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.