గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు కొనసాగనున్నాయి. అయితే కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయనున్నాయి. మరోవైపు గురునానక్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రేపు మూతపడనున్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని బ్యాంకులు కోరాయి.