TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కుట్ర అంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సంఘటనలో లేని బీఆర్ఎస్ కార్యకర్తలను అమానుషంగా కొట్టారని, సురేష్ అనే వ్యక్తి తమ పార్టీ కార్యకర్తే.. ఆయనకు అక్కడ భూమి ఉందన్నారు. లగచర్ల ఘటనలో ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారని విమర్శించారు.