ప్రకాశం: కొరిశపాడు గ్రామంలోని NH-16 జాతీయ రహదారి వెంబడి ఉన్న బస్సు షెల్టర్ మందుబాబులకు అడ్డగా మారింది. బస్ షెల్టర్లో ప్రయాణికులు కూర్చోవడానికి అసౌకర్యానికి గురయ్యే విధంగా గురువారం ఎక్కడ చూసినా ముందు సీసాలే దర్శనమిచ్చాయి. దీంతో గంటల తరబడి బస్సుల కోసం రోడ్లపై పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.