ASR: త్వరలో జరగనున్న పెసా కమిటీ ఎన్నికల్లో ఆదివాసీ హక్కుల రక్షణ కోసం పోరాటం చేసే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఆదివాసీ గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లోతా రామారావు, కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. పెసా గ్రామ సభల ఆమోదం ద్వారా పరిపాలన సాగించాలని కోరారు. జీవో నెంబరు-3 పునరుద్ధరణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.