VSP: వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 44వ వార్డు అక్కయ్యపాలెం పార్కులో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు హాజరైన ఉత్తర నియోజకవర్గ బీజేపీ నాయకులు శ్యామల దీపక్ మాట్లాడుతూ.. ఇక్కడ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. రంగా అన్ని వర్గాల వారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు.