బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర తమిళనాడు, ఏపీ వైపు పయనిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.