TG: సీఎం రేవంత్ ఇవాళ పలు ఎకో టూరిజం ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. అటవీ, పర్యావరణహిత అభివృద్ధి కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బొటానికల్ థీమ్ పార్కులు, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ప్రారంభించనున్నారు. కొత్తగూడెం-పాల్వంచ, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొననున్నారు.