మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గడ్డం ఉండటం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి ముఖం కవర్ అవుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం తేమగా ఉండటం కారణంగా మొహంపై పగుళ్లు, మొటిమలు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. గాలిలో ఉండే బ్యాక్తీరియా త్వరగా నోటిలోకి చేరకుండా అడ్డుకుంటుంది. గడ్డం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు, పొడి చర్మం సమస్య నుంచి బయటపడొచ్చు.