భారతీయులకు థాయ్లాండ్ శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి భారతీయులకు ఈ-వీసాను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో భారత్ పర్యాటకులకు ఇచ్చిన 60 రోజుల వీసా మినహాయింపును యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ-వీసాను పొందటం కోసం వీసా ఫీజును ఆఫ్లైన్ పద్ధతిలోనూ పేమెంట్ చెల్లించవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం తమ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చని పేర్కొంది.