కర్నూలు: డోన్‌లోని కోట్లవారి పల్లె సమీపాన రోజు కూలికి వెళ్లే మహిళ ఫ్యాక్టరీ పల్వరైజర్ మిషన్‌లో ఇరుక్కుని మృతి చెందింది. మృతురాలు డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోకేశ్వరమ్మగా స్థానికులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.