ఆడుకుంటూ వెళ్లి పొలంలోని 150 అడుగుల బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించినా.. ఫలితం లేకుండా పోయింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. అయితే బాలుడు అపస్మారకస్థితిలో ఉండటంతో.. ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని దౌస జిల్లాలో జరిగింది.