ATP: నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం ఇంటింటి చెత్త సేకరణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కాలనీలోని సమస్యల గురించి ఆరా తీశారు. ఇంటింటికి వచ్చి ప్రతిరోజు చెత్తను స్వీకరిస్తున్నారా, పారిశుద్ధం బాగా చేస్తున్నారా, తదితర వివరాలను ప్రజలకు ఆరా తీశారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా తప్పదన్నారు.