ఇటీవల కాలంలో పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. పదేళ్లలోపు పిల్లల్లే ఊబకాయులుగా మారటం ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవటమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లోపించటం వల్ల ఆహారం మీద నియంత్రణ దారితప్పుతుంది. అందుకే పసివయసు నుంచే మంచి ఆహారపు అలవాట్లు చేయాలి. నిర్ణీత వేళల్లో తగినంత పోషకారం ఇవ్వాలి. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ వంటివి పెట్టకూడదు.