కర్నూలు: మద్దికెర మండలంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయంలో టెంకాయలు, తమలపాకుల విక్రయం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ వేలంపాటలు వాయిదా వేసినట్లు కార్యనిర్వహణాధికారి వీరయ్య తెలిపారు. పెరవలిలో ఆయన మాట్లాడారు. ఆలయ ఆవరణలో వేలాలు నిర్వహించగా, గతేడాది కంటే తక్కువకు పలకడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వాయిదా వేస్తామన్నారు మళ్లీ ఎప్పుడు వేసేది తెలియజేస్తామని ఆయన చెప్పారు.