MBNR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 53 ఓట్ల మెజార్టీతో రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన ఓటర్లందరీకీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రం నలుమూలల క్రీడల పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి పెంచుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.