కర్నూలు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశా చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితాలకు మోసపోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.