AP: నేడు అమరావతి రైతుల ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లకు ఈ-లాటరీ నిర్వహించనున్నారు. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ-లాటరీ ప్రక్రియ జరగనుంది. ఆన్లైన్ ద్వారా ర్యాండమ్ సిస్టమ్ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు ఉండనుంది. నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించనున్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు ఈ-లాటరికీ హాజరు కావాలని సీఆర్డీఏ కమిషనర్ ప్రకటన జారీ చేశారు.