తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, తమిళనాడులోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పుదుకోట్టె, నాగపట్నం, తిరువారూర్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. డెల్టా ప్రాంతాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. పుదుచ్చేరి, కారైకల్‌లో విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు.