TG: నేటి నుంచి సచివాలయంలో ‘ఫేషియల్ రికగ్నైజేషన్’ విధానం అమల్లోకి రానుంది. సచివాలయ ఖాతా నుంచి జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఉదయం కార్యాలయానికి వచ్చేటప్పుడు, విధులు ముగించుకొని వెళ్లే సమయంలో కచ్చితంగా అటెండెన్స్ వేయాలని సూచించారు.