విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజా’ మూవీ చైనా భారీ వసూళ్లను రాబడుతోంది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 70 కోట్లను వసూలు చేసింది. డ్రాగన్ దేశంలో ఇటీవల కాలంలో ఏ భారతీయ సినిమా సాధించలేని వసూళ్లతో దూసుకుపోతుంది. దీంతో చైనా మార్కెట్లో అత్యధిక వసూళ్లను సాధించిన 13వ భారతీయ చిత్రంగా నిలిచింది.