యూపీ కలోనల్గంజ్కు చెందిన రేష్మకు 2021లో షానవాజ్ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే, అదనపు కట్నం కోసం రేష్మను అత్తమామలు చిత్రహింసలకు గురిచేశారు. గదిలో బంధించి డ్రైన్ పైపు గుండా పామును వదిలారు. దీంతో ఆమెను పాము కాటు వేసింది. నొప్పికి తాళలేక ఏదోలా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్తింటి వారిపై పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు.