AP: వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరు అయితే.. వైసీపీ హయాంలో 4 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.