కొంతమందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. పచ్చి బెండకాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బెండకాయలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సమస్యలు దరిచేరవు. బెండకాయలో తక్కువ కెలరీలు ఉంటాయి. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది.