»Blind Bhavesh Chandulal Bhatia Employment To 3500 People Through Sunrise Candles Company Anand Mahindras Post Went Viral
Anand Mahindra: అంధుడైనా సరే 3500 మందికి ఉపాధి ఇస్తున్నాడు
అంధుడైనా సరే ఆత్మవిశ్వాసంతో ఓ క్యాండిల్ కంపెనీని స్థాపించి 3500 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి గురించి పోస్ట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Blind Bhavesh Chandulal Bhatia, employment to 3500 people through Sunrise Candles Company. Anand Mahindra's post went viral
Anand Mahindra: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) గురించి అందరికి తెలిసిందే. సమాజంలో సేవ చేస్తున్న, లేదా గొప్ప ప్రతిభా ఉండీ ఆర్థికస్థోమత లేని వారేవరైనా తన దృష్టికి వెళితే వారి గురించి ఆరా తీసి తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు. అంతే కాదు వారి ఆర్థికంగా కూడా సాయం చేస్తారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. వీధి పక్కన కొవ్వొత్తులు(Candles ) విక్రయించుకునే అంధుడైన ఓ చిరు వ్యాపారి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి..3,500 మంది అంధులకు ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తన దృష్టికి వచ్చిన వాటిలో అత్యంత స్ఫూర్తినీయంగా అనిపించిన స్టోరీ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా (52). రెటీనా మాక్యులర్ డీజనరేషన్ పుట్టుతోనే చూడలేడు. కానీ చూపు లేదని ఎన్నడు బాధపడలేదు. తన జీవితంలో చీకటి ఉన్నాసరే ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచాలనుకున్నాడు. తన సంకల్పమే అతన్ని ఓ వ్యాపారవేత్తగా మార్చింది. 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో సన్ రైజ్ క్యాండిల్స్ పేరుతో కొవ్వొత్తుల పరిశ్రమను స్థాపించారు. ఇప్పుడు ఈ సంస్థ 14 రాష్ట్రాల పరిధిలో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. 3,500 మంది అంధులకు భాటియా ఉపాధి కల్పించారు. ఇదే ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసింది. దీని గురించి ఇలా రాసుకొచ్చారు. ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదే. ఇప్పటి వరకు తాను భవేష్ గురించి వినకపోవడం బాధగా ఉందన్నారు. ప్రతిభా ఉన్నా కూడా ఎందరో చిన్న చిన్న అవరోధాలకు ఆగిపోతుంటారు. కానీ భవేష్ అందరికి స్పూర్తీ అని పేర్కొన్నారు.
“Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3