ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీనే ఈ పనికి పాల్పడిందంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి.. బండి సంజయ్(Bandi Sanjay) యాదాద్రిలో ప్రమాణం చేసి తాను కానీ తన పార్టీ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేశారు. తాను చేసిన ప్రమాణం వల్ల కేసీఆర్ కుటుంబ రాజకీయ చరిత్ర సమాధి కాబోతుందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పరీక్షలకు సిద్ధమా అని ఆయన కామెంట్లు చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరడం గమనార్హం. కేసీఆర్ కుటుంబానికి మద్దతు తెలిపిన వాళ్లంతా దొంగలు అని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామని కేసీఆర్ సర్కార్ కుట్రకు తెర లేపిందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
తెరాస ఎమ్మెల్యేలు అమ్ముడుపోతామని చెబితే బీజేపీకి సంబంధం ఏంటని బండి సంజయ్ అన్నారు. డబ్బులతో పట్టుబడిన బ్యాగులు ఎక్కడికి వెళ్లాయని బండి సంజయ్ ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో టేపులు వరుసగా లీక్ అవుతున్నాయి. ఆడియో టేపుల గురించి ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో చూడాలి.