TG: హైదరాబాద్లో ఈ నెల 14 నుంచి ప్రారంభకానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పోస్టర్లను ఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించిన సీఎం.. 57 ఏళ్ల తర్వాత ఈ ట్రోఫీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ ట్రోఫీలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 37 జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 14 నుంచి 31 వరకు ఈ ట్రోఫీ జరగనుంది.