చలికాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ముఖ్యం. ఇందుకోసం ఉసిరి టీ చక్కగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెంచా ఉసిరి పొడి, కొద్దిగా అల్లం, రెండు తులసి ఆకులు, చిటికెడు జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి. లేదా తాజా ఉసిరికాయ గుజ్జుని నీళ్లలో మరిగించి కూడా తాగొచ్చు. ఇలా చేస్తే బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.