ఆదిపురుష్(Adipurush) సినిమా మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్… టీజర్ రిలీజ్ అయ్యాక లేదనే చెప్పాలి. ఒకే ఒక్క టీజర్ సినిమా పై పెట్టుకున్న అంచనాలను తగ్గేలా చేసింది. నెటిజన్స్, సినీ క్రిటిక్స్ సైతం ఆదిపురుష్ రిజల్ట్‌ను ముందే చెప్పేస్తున్నారు. విజువల్స్ పరంగా.. రామాయణ పాత్రల డిజైనింగ్ పరంగా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటునే ఉంది ఆదిపురుష్ టీమ్. ఇదే విషయాన్ని నమ్మి.. మిగతా సినిమాలు పోటీకి దిగుతున్నట్టు కనిపిస్తోంది.
అలాగే ఆదిపురుష్ పోస్ట్‌పోన్ అవనుందనే ప్రచారం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మరో వెర్షన్ ప్రకారం.. కొందరు సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ ఆదిపురుష్‌ని వాయిదా వేయించేందుకు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. కాస్త డైలమాలో ఉన్న సినిమాలన్నీ.. ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య సై అంటున్నారు. వీరసంహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పాటు విజయ్ ‘వారసుడు’.. అఖిల్ ‘ఏజెంట్’ సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు.
దాంతో ఆదిపురుష్‌కు తెలుగులో గట్టి పోటీ తప్పేలా లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఆదిపురుష్ ఆలస్యంగా రానుందనే క్లారిటీ వచ్చిన తర్వాతే.. ఈ సినిమాల రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. గ్రాఫిక్స్ కారణంగా ఆదిపురుష్ ఇంకొంత సమయం తీసుకునే ఛాన్స్ ఉందని.. అందుకే జనవరి 12న ఆదిపురుష్ రిలీజ్ ఉంటుందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.