చాలా మంది పుదీనా ఆకుల(Mint Leaves)ను ఆహారంలో చేర్చుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ పుదీనా ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి(Health Benefits). పుదీనాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పుదీనా నీటి(Mint Water)ని తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూర్చుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా నీరు(Mint Water) తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు(Skin Problems) దూరం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో పుదీనా చాలా సాయపడుతుంది. అధిక దాహం సమస్యకు పుదీనా వాటర్ చెక్ పెడుతుంది. పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. జీర్ణవ్యవస్థను పెంచడంలో పుదీనా బాగా పనిచేస్తుంది. బరువు (Weight) తగ్గాలనుకునేవారికి పుదీనా దివ్యౌషధంలా పనిచేస్తుంది.
గ్యాస్ సమస్యల(Gas Problem)తో బాధపడేవారు పుదీనా వాటర్ (Mint Water)ను క్రమం తప్పకుండా సేవిస్తూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. నోటి దుర్వాసన(Mouth Smell)ను తగ్గించడంలో పుదీనా నీరు సహాయపడుతుంది. పుదీనాలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తొలగించడంలో తోడ్పడుతాయి. అలాగే పుదీనా వాటర్ పోషకాలను శరీరానికి అందిస్తుంది. వేగవంతమైన జీవక్రియ ద్వారా బరువును తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది.
ఊపిరితిత్తుల(Lungs) ఆరోగ్యానికి, శ్వాసనాళాలు, గొంతు, ముక్కు సంబంధిత సమస్యలు తగ్గడానికి పుదీనా(Mint) ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాసకోశ మార్గాలతో పాటు, దగ్గు వల్ల వచ్చే సమస్యల నుంచి కూడా పుదీనా ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లో పుదీనా వాటర్(Mint Water)ను తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.