TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. నిన్న అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది.