AP: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో తెలిపారు. అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. పోలవరం కెపాసిటీ తగ్గించడం వల్ల 7 లక్షల ఎకరాలకు అందాల్సిన నీరు.. కేవలం 3.2 లక్షల ఎకరాలకే అందుతుందన్నారు. ఈ అన్యాయాన్ని ఆంధ్ర ప్రజలు క్షమించరని అన్నారు.