తీరిక లేదని కొంతమంది హడావిడిగా వేడివేడి టీ, కాఫీలు తాగటం.. ఫుడ్ తినటం వంటివి చేస్తుంటారు. ఇలా చేసేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. అలా చేయటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారాలను తిన్నప్పుడు అన్నవాహికపై ప్రభావం పడి కాలుతుంది. అది కాస్తా ఇన్ఫ్లమేషన్కి దారి తీస్తుంది. దీర్ఘకాలం కొనసాగితే క్యాన్సర్‌కి కారణమవుతుందని పరశోధనలో తేలింది. కాబ్టటి పొగలు కక్కే ఆహారం, పానీయాలను తీసుకోకూడదు.