TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయదుందుభి మోగించారు. ఈ ఉపఎన్నికలో BRS రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. BJP డిపాజిట్ గల్లంతయింది. నవీన్ యాదవ్కు మొత్తం 98,988 ఓట్లు రాగా.. మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 17,061 ఓట్లు పోలయ్యాయి.