TG: ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై సమీక్ష సందర్భంగా కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు. కొత్తగూడెం, వికారాబాద్, HYD, రంగారెడ్డిలోని ఆస్తులపై మార్చిలోపు లెక్కలు తేల్చాలని చెప్పారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.