VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోర్ బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువుగా భావించే బంజారా సమాజానికి చెందిన సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడైన సంత సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.