గోవా మాజీ MLA, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్ (68) మృతిచెందారు. కర్ణాటకలోని ఓ హోటల్ నుంచి లావో బయటకు వస్తుండగా కారు ఢీకొట్టిందని ఆటోడ్రైవర్ గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. అనంతరం లావో లాడ్జిలోకి వెళ్లగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు.