చలికాలంలో పొడిగాలి కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి చెంది గొంతు నొప్పి పెడుతుంది. గొంతులో గరగర, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. దీన్ని తగ్గించాలంటే.. వేడి టీలో కాసింత తేనె లేదా వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. లేకపోతే గోరువెచ్చని నీటిలో ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. రోజూ ఒకటి, రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలాలి, ఆవిరి పీల్చుకోవాలి.