TG: కండువా కప్పితే పార్టీ మారినట్లు కాదంటూ CM రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. సదరు ఎమ్మెల్యేలే అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు ఒప్పుకున్నారని, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వారిని చేర్చుకున్నట్లు తెలిపారని గుర్తుచేశారు. అయినా పార్టీ మారినట్లు కాదని రేవంత్ అనడం హాస్యాస్పదమని, తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.