మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 బీఎంఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే మీడియా ప్రతినిధిపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. కాగా, మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేసి.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు హాజరుకావాలని తెలిపారు.