TG: అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు శాసనమండలి సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశంలో రైతు భరోసా, కులగణన, రుణమాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.