AP: రేషన్ బియ్యం అక్రమాలపై మాజీమంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. పౌరసరఫరాలశాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు జయసుధపై బందరు పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని గిడ్డంగి నిర్మించారు. ఇటీవల ఆ గిడ్డంగిని తనిఖీ చేసిన అధికారులు.. బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు తేల్చారు.