ఆడవాళ్లు ధరించే దుస్తువుల్లో ఎన్ని రకాలున్నా చీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఎంత ఖరీదు పెట్టి కొన్నా.. ఎంత నాణ్యమైన చీర అయినా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. చీరకట్టు అందగా ఉండేందుకు ఎంపిక చేసుకునే పెట్టికోట్ కీలకం. తేలికైన చీరలకు బరువుగా ఉండేవి.. బరువైన చీరలకు తేలికగా ఉండే పెట్టికోట్ ఎంచుకోవాలి. నెట్ శారీకి సాటిన్, షిమ్మర్ రకం బెటర్. కొత్త చీరలకు పాతవి వాడకూడదు.